ఆల్కహాల్, నిషేధిత వస్తువుల విక్రయం: ముగ్గురి అరెస్ట్
- May 04, 2017
ఆల్కహాల్ బెవరేజెస్ అలాగే నిషేధ వస్తువుల్ని అక్రమంగా విక్రయిస్తున్న కేసులో ముగ్గురు నిందితుల్ని రాయల్ ఒమన్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. అడమ్ పోలీస్ స్టేషన్‌కి చెందిన అధికారులు, ఇద్దరు ఆసియా జాతీయుల్ని, అక్రమంగా ఆల్కహాల్ బెవరేజెస్‌తోపాటు, నిషేధ వస్తువుల్ని అమ్ముతున్న కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. రాయల్ ఒమన్ పోలీసులు 100 బాటిళ్ళకు పైగా ఆల్కహాల్ బెవరేజెస్, 30 బాక్సుల్లో సిగరెట్లను నిందితుల ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో, డిపార్ట్‌మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ - ఇజ్కి పోలీస్ స్టేషన్ అధికారులు, ఆసియా జాతీయుడిని అరెస్ట్ చేయడంతోపాటు అతని నుంచి 140 బాటిళ్ళ ఆల్కహాల్ బెవరేజెస్ బాక్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఓ ప్రైవేటు వాహనంలో నిందితుడు విక్రయించేందుకు ప్రయత్నించాడు. నిందితులపై చట్టపరమైన చర్యలుంటాయని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్‌లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









