'బ్రూస్‌లీ' దసరా కానుక

- October 04, 2015 , by Maagulf
'బ్రూస్‌లీ' దసరా కానుక

రామ్‌చరణ్ హీరోగా నటించిన 'బ్రూస్‌లీ' దసరా కానుకగా అక్టోబర్ 16న రిలీజ్ కావడానికి సిద్ధమవుతోన్న ఈ సినిమా చివరి దశ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. రామ్‌చరణ్ తన పార్ట్‌కి సంబంధించిన షూట్‌ని శరవేగంగా పూర్తిచేస్తూనే మరోవైపుడబ్బింగ్ కూడా చెబుతున్నాడు. ఈ సినిమాలో చరణ్‌తోపాటు మెగాస్టార్ చిరుకూడా ఓ మూడు నిమిషాలపాటు కనువిందు చేయనున్నాడు. ఆ పార్ట్ షూటింగ్ కూడా పూర్తయ్యింది. మరో 3 రోజుల్లో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. 'ది ఫైటర్' అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమాలో రామ్‌చరణ్ ఓ స్టంట్ మాస్టర్‌గా కనిపించనున్నాడు. అతడి సరసన రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నదియా, రావురమేష్, కృతికర్బంద ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. తమన్ మ్యూజిక్ అందించిన ఆడియో ఇటీవలే రిలీజ్ అయి సూపర్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా నిర్మాత డివివి దానయ్య మాట్లాడుతూ.. ఇటీవలే విడుదలైన ఆడియోకు మంచి రెస్పాన్స్ వచ్చిందని, తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు అన్నిరకాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయని అన్నారు. మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ పాత్రలో కనిపించే ఈ సినిమా ఆడియోను ఆయన విడుదల చేయడం చాలా ఆనందంగా ఉందని, త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మిగతా కార్యక్రమాలన్నీ పూర్తిచేసి 16న విడుదల చేస్తాం అన్నారు. (చిత్రం) రామ్‌చరణ్, నిర్మాత డివివి దానయ్య

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com