అమెరికా శాన్ జోస్ లో ఎన్నారై దంపతుల హత్య
- May 06, 2017
అమెరికాలో ఎన్నారై దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. శాన్ జోస్ లో భారత్ కు చెందిన నరేన్ ప్రభు దంపతులను.. మిర్జా టాట్లిక్ అనే అమెరికన్ కాల్చిచంపాడు. మిర్జా టాట్లిక్.. నరేన్ ప్రభు కుమార్తె రేచల్ ప్రభు మాజీ ప్రియుడు. విభేదాలతో రేచల్ ప్రభు, మిర్జా టాట్లిక్ విడిపోగా.. మీర్జా ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తుపాకీతో ఇంట్లోకి చొరబడ్డ మిర్జా.. నరేన్ ప్రభుపై తూటాల వర్షం కురిపించాడు. అనంతరం అతని భార్య పైనా కాల్పులు జరిపాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడిని మట్టుబెట్టారు. మిర్జా టాట్లిక్ కు గతంలో కూడా క్రిమినల్ రికార్డ్ ఉందని.. పోలీస్ అధికారులు తెలిపారు. అయితే ఈ దాడి జరిగిన సమయంలో అతని మాజీ ప్రియురాలు రేచల్ ప్రభు.. శాన్ జోస్ లో లేదు.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- UAE participates in 12th GCC Labour Minister’s Committee meeting in Bahrain
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం







