ఖతారీ జలాల్లోని చేపలతో ప్రమాదం లేదు

- May 06, 2017 , by Maagulf
ఖతారీ జలాల్లోని చేపలతో ప్రమాదం లేదు

మినిస్ట్రీ ఆఫ్‌ మునిసిపాలిటీ మరియు ఎన్విరాన్‌మెంట్‌, ఖతారీ జలాల్లోని చేపల్లో టాక్సిక్‌ అవశేషాలున్నాయనీ, ఆ కారణంగా వాటిని తినడం ఆరోగ్యానికి మంచిది కాదనీ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది. వివిధ మార్గాల్లో ఖతారీ జలాల్లోని చేపలపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ, ప్రజల్లో నెలకొన్న ఆందోళన నేపథ్యంలో కొన్ని చేపల్ని అలాగే ఖతారీ జలాల్నీ పరిశోధనకు పంపింది. ఆ పరిశోధన వివరాల్ని కూడా అధికారులు వివరించారు. ఖతారీ జలాల్లోని చేపలు పూర్తిగా సురక్షితమైనవని పేర్కొంటూ, ఎక్కడా ఎలాంటి టాక్సిక్‌ మెటీరియల్‌ జాడ కూడా పరిశోధనల్లో దొరకలేదని చెప్పారు. సోషల్‌ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని చేపల్ని తినాలనుకునేవారు నిరభ్యంతరంగా తినవచ్చునని అధికారులు స్పష్టం చేశారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com