కటారా మార్కెట్‌ యాంటిక్స్‌పై జిసిసి విజిటర్స్‌ ఆసక్తి

- May 06, 2017 , by Maagulf
కటారా మార్కెట్‌ యాంటిక్స్‌పై జిసిసి విజిటర్స్‌ ఆసక్తి

కటారా మార్కెట్‌, దోహాకి చెందినవారినే కాకుండా జిసిసి దేశాల నుంచి కూడా పలువుర్ని ఆకర్షిస్తోంది. కటారా బీచ్‌ ఏరియాలో ఏర్పాటు చేసిన కల్చరల్‌ విలేజ్‌లో, హ్యాండ్‌ మేడ్‌ క్లాతింగ్‌, సిరామిక్స్‌, యాంటిక్స్‌ కలెక్షన్‌, యూజ్‌డ్‌ బుక్స్‌, హ్యాండిక్ఫ్రాన్ట్స, పెయింటింగ్స్‌, ఇస్లామిక్‌ ఆర్ట్‌ వర్క్స్‌ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. కటారా మార్కెట్‌లో ఓ షాప్‌ నిర్వహిస్తున్న సిరియన్‌ డిజైనర్‌ మొహమ్మద్‌ హతీమ్‌ మాట్లాడుతూ, తన రెగ్యులర్‌ కస్టమర్స్‌ ఎక్కువగా సౌదీ అరేబియా నుంచి ఉంటారనీ, వారికి కావాల్సినవి తన దగ్గర కొంటుంటారని చెప్పారు. వారాంతాల్లో ఎక్కువగా సౌదీ షాపర్స్‌ వస్తుంటారనీ, వింటర్‌ కాలంలో వారి తాకిడి ఎక్కువగా ఉంటుందని వివరించాడాయన. హ్యాండ్‌ మేడ్‌ ప్రోడక్ట్స్‌ని జిసిసి జాతీయులు ముఖ్యంగా ఖతారీలు ఎక్కువగా ఇష్టపడతారని ఆయన చెప్పారు. టర్కీకి చెందిన మహమౌద్‌ కింగ్‌ మాట్లాడుతూ, మార్కెట్‌కి వచ్చేవారి సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తోందని అన్నారు. పెయింటింగ్స్‌తోపాటు జ్యుయెలరీ, బ్యూటీ డిజైన్డ్‌ జార్స్‌, సిరామిక్స్‌, సావనీర్‌, గ్లాస్‌ బాటిల్స్‌ ఇలా పలు ఆకర్షిణీయమైన వస్తువుల్ని విక్రయిస్తుంటారాయన. రేడియో సెట్స్‌, పోలరాయిడ్‌ కెమెరాస్‌, గ్రామ్‌ఫోన్‌ రికార్డ్‌ ప్లేయర్‌, యాంటిక్‌ ఫోన్‌ సెట్స్‌, హోమ్‌ డెకార్స్‌ కూడా ఇక్కడ లభ్యమవుతాయి. పాత వస్తువులు పనిచేయవని కొందరు అనుకుంటారనీ, కానీ పనికొచ్చే వస్తువులే తాము విక్రయిస్తామని మరికొందరు షాప్‌ యజమానులు చెప్పారు. ఫుడ్‌ ఐటమ్స్‌ కూడా కటారా మార్కెట్‌లో ప్రధాన ఆకర్షణ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com