వేసవిలో కళ్లు మంటలా... ఇలా చేయండి
- May 06, 2017
ఏటుకేడు వేసవి ఎండ తీవ్రత పెరుగుతోంది. ఈ సంవత్సరం మరీ ఎక్కువ స్థాయిలో ఉంది. దీనికి కాలుష్యం ఒక కారణం. దీని స్థాయి పెరిగే కొద్దీ అతినీలలోహిత కిరణాలు భూమిని తాకడం ఎక్కువైంది. దీనివల్ల కంటికి, చర్మానికి సంబంధించిన వ్యాధులు పెరుగుతున్నాయి. ఈ వేసవిలో ఇప్పటికే వేడి వల్ల 30% శాతం వరకు కంటి సమస్యల కేసులు పెరిగాయని కంటి వైద్యులు చెబుతున్నారు.
ముఖ్యంగా కన్నులు మంట కలిగి ఎరుపు రంగులోకి మారడం, దురదగా ఉండటం, కన్నులు ఎరుపుగా ఉండి కనురెప్పలు వాచినట్టు ఉండడం మొదలైనవి వేడి వల్ల కలిగే లక్షణాలు. దీని నుండి ఉపశమనం పొందాలంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ సమయం ఎండలో తిరగడం, ప్రయాణించడం, కష్టంతో కూడిన పని చేయడం వంటివి తగ్గించాలి. అవసరం ఉంటేనే బయటకు రావాలి, వీలైతే సన్‌గ్లాసులు వాడండి.
తలపై టోపీ లేదా రుమాలు ధరించండి. క్రమం తప్పకుండా తలకు నూనె రాయాలి. కంటికి చుక్కల మందు వేసుకోవాలి. ఒక టీ బ్యాగ్‌ని తీసుకొని చల్లటి నీళ్లలో ముంచి కనురెప్పల మీద 10-15 నిమిషాల పాటు ఉంచుకొని ముఖం కడుక్కోవాలి. ఇలా రోజులో 2-3 సార్లు చేస్తే కళ్ల మంటలు తగ్గుతాయి. సమస్య తీవ్రం అయ్యేట్లు ఉంటే వెంటనే డాక్టర్‌ని సంప్రదించండి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







