డాక్ లోన పశుక్షేత్రంలో గడువు ముగిసిన పాలు విక్రయంపై చర్యలు
- May 07, 2017
పాలు అందరకీ... సంపూర్ణ ఆహారమైతే, కొందరకి...అక్రమార్జనకు పరిపూర్ణ అవకాశం...గడువు ముగిసిన పాలను తాజా పాలుగా విక్రయిస్తున్నారనే సమాచారం అందుకొన్న అధికారులు ఒక పశుక్షేత్రంపై దాడి చేశారు.మకాబాలోని ఆ విక్రయ కేంద్రంపై అధికారులు తక్షణమే న్యాయపరమైన చర్యలు చేపట్టారు ఆ ప్రాంతంలోని పశుక్షేత్ర యజమానులకు గడువు ముగిసిన తేదీలను ప్రచురించిన పాల ప్యాకెట్లు తమ దగ్గరకు వచ్చారని, వాటిని తమకు తాజా పాలుగా అమ్ముతున్నట్లు చూపుతున్నారని కొందరు వినియోగదారులు పిర్యాదు చేయడంతో జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ పరిశోధకులు ఆ పశు క్షేత్రంపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆ పశుక్షేత్రంలోని ఒక దుకాణంలోగడువు ముగిసిన తేదీతో ఉన్న పలు పాల ప్యాకేజీలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఈ నిలవ పాల సమాచారంను పబ్లిక్ ప్రాసిక్యూషన్ మరియు సంబంధిత అధికారులకు,ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖతో సహా పలువురికి తెలియజేయడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ జారీచేసిన ఉత్తర్వు ప్రకారం,ఈ పశుక్షేత్రంలోని దుకాణంకు చెందిన అన్నిశాఖలను వెంటనే అధికారులు మూసివేయించారు.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







