ప్రయాణీకుల కోసం ఒమన్‌లో షేర్ ట్యాక్సీ
- May 08, 2017
మస్కట్: మర్హాబా ట్యాక్సీ సర్వీసులు 'హోమ్ టు వర్క్' పేరుతో ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. నలుగురు వ్యక్తులు ట్యాక్సీని షేర్ చేసుకునేందుకు వీలుంది. 15 కిలోమీటర్ల వరకు 60 ఒమన్ రియాల్స్, 15 నుంచి 25 కిలోమీటర్ల దూరానికి 90 ఒమన్ రియాల్స్, 25 నుంచి 30 కిలోమీటర్ల వరకు 150 ఒమన్ రియాల్స్, 45 నుంచి 50 కిలోమీటర్లకు 180 ఖతారీ రియాల్స్ నెలకు చెల్లించాల్సి ఉంటుందని మర్హాబా ట్యాక్సీ అధికారులు తెలిపారు. కంపెనీ ప్రస్తుతం 75 ట్యాక్సీలను కలిగి ఉన్నట్లు వారు వివరించారు. సుల్తాన్ కుబూస్ పోర్ట్, హోటల్స్ వద్ద ట్యాక్సీలను నడిపేందుకు వీలుగా లైసెన్స్ పొందినట్లు మర్హాబా ట్యాక్సీ వర్గాలు వెల్లడించాయి. మొబైల్ యాప్ ద్వారా లేదా కాల్ సెంటర్‌కి ఫోన్ చేయడం ద్వారాగానీ ఈ సేవల్ని వినియోగించుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు నెలవారీ కాంట్రాక్ట్ నిమిత్తం 'సైన్' అవ్వాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- 65 ఏళ్ల చరిత్ర కలిగిన పోలీస్ ఆఫీసర్స్ మెస్‌ను సమీక్షించిన డీజీపీ సి.వి.ఆనంద్
- మెటా సోషల్ మీడియా సేవలు పునరుద్ధరణ..
- డీజిల్ భారం తగ్గాల్సిందే: TGSRTC ఎండీ వై.నాగిరెడ్డి
- డ్రగ్స్ తో పట్టుబడిన మోడల్
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు









