మే 27న రమదాన్ ప్రారంభం!
- May 08, 2017
పవిత్ర రమదాన్ మాసం మే 27న ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. జూన్ 24న రమదాన్ మాసం ముగియవచ్చునని మూన్ సైటింగ్ రిపోర్ట్స్‌ని బట్టి తెలియవస్తోంది. తొలి క్రిసెంట్ న్యూ మూన్తో రమదాన్ మాసం ముగుస్తుంది. ఈద్ అల్ ఫితర్, ఇస్లామిక్ హాలిడే - అదే రమదాన్ మాసం ముగింపుగా పరిగణిస్తారు. రమదాన్ సందర్బంగా యూఏఈలో పని గంటల్ని రెండు గంటలపాటు తగ్గించడం ఆనవాయితీగా వస్తోంది. సూర్యోదయం నుంచి సూర్యాస్థమయం వరకు రమదాన్ సందర్భంగా ఉపవాస దీక్షలు చేస్తారు ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం సోదరులు. ఒక్కోసారి రమదాన్ తేదీ కొన్ని దేశాల్లో కొంచెం అటూ ఇటూగా ఉంటుంది. చంద్ర దర్శనాన్ని బట్టి ఈ మార్పులు ఉంటాయి. రోజువారీ ఉపవాస దీక్ష సమయం, సూర్యోదయం - సూర్యాస్థమయ సమయాల్ని బట్టి మారుతుంటుంది. వేసవి కాలంలో వచ్చే రమదాన్ కారణంగా ఉపవాస దీక్షల సమయం ఎక్కువ ఉంటుంది.
తాజా వార్తలు
- పాస్‌పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలను జూలై 1 నుంచి అల్ హింద్ కు గ్రీన్ సిగ్నల్
- 65 ఏళ్ల చరిత్ర కలిగిన పోలీస్ ఆఫీసర్స్ మెస్‌ను సమీక్షించిన డీజీపీ సి.వి.ఆనంద్
- మెటా సోషల్ మీడియా సేవలు పునరుద్ధరణ..
- డీజిల్ భారం తగ్గాల్సిందే: TGSRTC ఎండీ వై.నాగిరెడ్డి
- డ్రగ్స్ తో పట్టుబడిన మోడల్
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ









