భారత్ లో వాట్సాప్.. 4 ఆశ్చర్య పోయే అంశాలు
- May 08, 2017
ప్రపంచ వ్యాప్తంగా నెలకు 1.2బిలియన్ల మంది వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు. కాగా, ఒక్క భారత్‌లోనే నెలకు 160 మిలియన్ల మంది ఈ యాప్‌లో క్రియాశీలకంగా ఉన్నారు. ఒక్క చాటింగ్ యాప్‌గానే కాకుండా మరింత వేగవంతంగా సమాచారం చేరవేసేలా సహాయపడుతున్నా ఈ యాప్‌ను భారత్‌లో అధికంగా సామాజిక ప్రయోజనాలకోసమే ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా అధికారులు ప్రజలతో మమేకమయ్యేందుకు విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.
వాటిల్లో కొన్ని ఉదాహరణలు చూస్తే.. ఈ యాప్ ద్వారా ప్రస్తుతం ఢిల్లీలో మహిళల భద్రతకు పెద్ద డ్రైవ్‌నే నిర్వహిస్తున్నారు. వారు ఏ వాహనాన్ని ఎక్కుతున్నారో దానిని వెంటనే ఓ ఫొటో తీసి పంపిస్తే దాని ద్వారా వారిపై ఎలాంటి దాడులు జరిగినా వెంటనే గుర్తించే వీలయ్యేలా ఏర్పాట్లు చేశారు. దీంతో ప్రస్తుతం ఢిల్లీలో మహిళలు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటున్నారు. అలాగే, ప్రస్తుతం ఎన్నో నగరాలు నేరాల ఫిర్యాదులకు వాట్సాప్‌ను ప్రారంభించగా ఊహించని విధంగా వారికి ఫిర్యాదులు అందుతున్నాయి. ఇక కేరళలో అయితే తప్పుచేసే ప్రభుత్వ అధికారులపై నేరుగా ఫిర్యాదు చేసేలా ఒక యాప్‌ను ప్రారంభించారు. అలాగే, అత్యవసర సమయాల్లో కూడా ఇండియాలో వాట్సాప్ ద్వారా శరవేగంగా స్పందిస్తున్నారు.
తాజా వార్తలు
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!









