రామాయణాన్ని త్రీడీలో మూడు భాగాలుగా.. అల్లు 'రామాయణం'
- May 10, 2017
రామాయణాన్ని వెండితెరమీద ఆవిష్కరించడానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నడుంబిగించారు. మధు మంతెన, నమిత మల్హోత్రాతో కలిసి ఆయన ఈ ప్రాజెక్ట్‌ను తెలుగు, తమిళ్, హిందీలో తెరకెక్కించనున్నారు. త్రీడీలో రూపొందే ఈ చిత్రాన్ని మూడు భాగాల్లో విడుదల చేయనున్నారు. భారతదేశంలో ఇప్పటివరకు ఏ సినిమానూ తెరకెక్కించనంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి అల్లు అరవింద్ టీమ్ ప్లాన్ చేస్తున్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ ''రామాయణంలాంటి మహాకావ్యాన్ని వెండితెరపై ఆవిష్కరించడం మామూలు విషయం కాదు. చాలా బాధ్యతాయుతంగా చేయాల్సిన పని. అంతటి అద్భుతమైన, కరుణరసాత్మకమైన కావ్యాన్ని కన్నులపండువగా తెరకెక్కించడానికి మేం సంసిద్ధులమయ్యాం'' అని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేయనున్నారు.
ఈ ఏడాది అక్టోబర్‌లోగానీ, నవంబర్‌లోగానీ ఈ చిత్రం షూటింగ్‌ను ప్రారంభించే అవకాశాలున్నాయి. మిగిలిన వివరాలను చిత్ర యూనిట్ త్వరలోనే వెల్లడించనున్నారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 40 మంది అరెస్టు..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా? Dh4 మార్కును తాకుతాయా?
- కువైట్ ఎయిర్పోర్ట్ T5 నుండి డైరెక్ట్ ఫ్లైట్స్.. జజీరా ఎయిర్వేస్
- ఖతార్ లో కమ్యూనిటీ రన్నింగ్ సెషన్లు ప్రారంభం..!!
- సంస్కరణల దిశగా రిమోట్ వర్క్.. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆమోదం..!!
- సాక్ష్యంగా ఈమెయిల్.. BHD11,000 దావా కొట్టివేత..!!
- గూగుల్ పే, ఫోన్ పేలకు పోటీగా వాట్సాప్..
- ప్రధాని మోదీ పై ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు!
- ప్రధాని తెలంగాణ పర్యటనకు ముహుర్తం ఫిక్స్..
- గాజా యుద్ధం తర్వాత తొలి ఎన్నికలలో ఓటు వేయనున్న పాలస్తీనియన్లు









