శ్రీలంకకు చేరుకున్నభారత్ ప్రధాని
- May 11, 2017
భారత ప్రధాని నరేంద్ర మోడీ కొద్దిసేపటి క్రితమే శ్రీలంకకు చేరుకున్నారు. శ్రీలంకలో మోడీ రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. బౌద్ధులు నిర్వహిస్తున్న అంతర్జాతీయ వేసక్ (సింహళీయుల బౌద్ధ పూర్ణిమ) ఉత్సవాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. శుక్ర, శనివారాల్లో నిర్వహించే ఈ వేడుకలకు సుమారు వంద దేశాల నుంచి 400 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. శ్రీలంకలో పర్యటన సందర్భంగా మోడీ అక్కడి తేయాకు తోటలకు ప్రసిద్ధి గాంచిన కేండీ ప్రాంతాన్ని సందర్శించనున్నారు. అలాగే భారత్ సహకారంతో కొలంబోలో నిర్మించిన ఆస్పత్రిని ప్రారంభించనున్నారు. శ్రీలంక నేతలతోనూ భేటీ అయ్యే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







