క్యాన్సర్‌తో బహ్రెయిన్‌లో చెల్లె అనంత లక్ష్మి మృతి
- May 11, 2017
బహ్రెయిన్ :క్యాన్సర్ బారిన పడి బహ్రెయిన్‌లో చెల్లె అనంతలక్ష్మి మృతి చెందారు. హౌస్ మెయిడ్‌గా ఆమె పనిచేస్తున్నారు. ఆమె భర్త, బహ్రెయిన్‌లోని ఓ క్లీనింగ్ కంపెనీలో పనిచేస్తున్నారు. వ్యవసాయ కూలీ కుటుంబానికి చెందిన వీరికి ముగ్గురు పిల్లలు, ఇండియాలో చదువుకుంటున్నారు. క్యాన్సర్ కేర్, ఆమె భర్తకు బహ్రెయిన్ నుంచి హైద్రాబాద్‌కి టిక్కెట్ సమకూర్చగా, ఆమె స్పాన్సరర్ ఫార్మాలిటీస్ పూర్తి చేశారు. ఎపిఎన్ఆర్టి, హైద్రాబాద్ నుంచి ఆమె స్వస్థలానికి ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో ఏర్పాటు చేసింది. అంబులెన్స్‌ని ఏర్పాటు చేసిన కె.సుధాకర్ రావు కి అభినందనలు. ఐసిఆర్‌ఎఫ్, ఎపిఎన్ఆర్టితో కలిసి తెలుగు కళా సమితి వైస్ ప్రెసిడెంట్ శివకుమార్ ఈ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షించారు. ఆర్థికంగా ఆ కుటుంబానికి ఆరు నెలలపాటు అండగా ఉండేందుకు ఐసిఆర్‌ఎఫ్ ముందుకొచ్చింది. ఇండియన్ ఎంబసీ సహకారంతో తెలుగు కళా సమితి, ఆమె కుటుంబానికి తగిన సహాయం చేయనుంది.
--యం. వాసుదేవ రావు (మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







