ముగిసిన ఏపీ సీఎం అమెరికా పర్యటన
- May 11, 2017
ముఖ్యమంత్రి చంద్రబాబు వారం రోజుల అమెరి కా పర్యటన ముగిసింది. శుక్రవారం మధ్యాహ్నానికి ఆయన అమరావతికి చేరుకుంటారని సీఎంవో అధికారు లు వెల్లడించారు. తన వారం రోజుల పర్యటన విజయవంతమయ్యిందని, ఏడు రోజుల్లో ఏడు వేల కిలోమీటర్లు ప్రయాణిం చినట్లు ముఖ్యమంత్రి ట్వీటర్లో పేర్కొన్నారు. అమెరికాలో ఐదు నగరాలను సందర్శించి, 30కి పైగా సమావేశాల్లో పాల్గొన్నానని, 90కి పైగా కంపెనీల ప్రముఖలను కలసినట్లు తెలిపా రు. తన పర్యటన ద్వారా విద్య, వైద్యం, ఫిన్‌టెక్, హార్డ్‌వేర్, ఐటీ, ఇంటర్నెట్ రంగాల్లో 12,500 మందికి ఉపాధి లభించనుం దన్నారు. ఇలావుండగా అమెరికా కాంగ్రెస్ ప్రతినిధిగా ఎన్నికైన తొలి దక్షిణ భారతీయుడు రాజా కృష్ణమూర్తిని గురువారం కలసిన చంద్రబాబు అమరావతి సందర్శించాల్సిందిగా కోరారు. అనంతరం చికాగాలో తెలుగు అసోసియేషన్ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









