విదేశాల నుంచి బంగారాన్ని చాక్లెట్ పెట్టెలో పసిడి రేకులు
- May 11, 2017
విదేశాల నుంచి బంగారాన్ని అడ్డదారిలో తరలించడానికి స్మగ్లర్లు ఎత్తుకుపైఎత్తు వేస్తూనే ఉన్నారు. తాజాగా ఓ ప్రయాణికుడు బంగారాన్ని పలచని రేకుగా మార్చి చాక్లెట్ డబ్బాల అంచులో పెట్టి తరలిస్తూ అడ్డంగా దొరికాడు. కస్టమ్స్ అధికారులు తెలిపిన కథనం ప్రకారం.. నగరానికి చెందిన ఓ వ్యక్తి గురువారం అబుదాబి నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగాడు. 423 గ్రాముల పసిడిని పలుచని రేకులుగా మార్చి.. వాటిని రెండు చాక్లెట్ బాక్సుల్లో.. ఓ ఫేస్‌క్రీమ్ బాక్సు లోపలి భాగం అంచులో దాచాడు. అతని ప్రవర్తనపై అనుమానం వచ్చి కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సామగ్రిని క్షుణ్ణంగా తనిఖీ చేయగా.. చాక్లెట్ బాక్సులు, ఫేస్‌క్రీమ్ బాక్సులో బంగారు రేకులను గుర్తించారు.దాదాపు రూ.12 లక్షల విలువైన బంగారు రేకులను స్వాధీనం చేసుకున్నారు. సమగ్ర విచారణ కోసం నిందితుణ్ని కస్టమ్స్ ప్రధాన కార్యాలయానికి తరలించారు. కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







