మ‌ల‌యాళం మూవీలో సినీ నటి జ‌యప్ర‌ద‌

- May 12, 2017 , by Maagulf
మ‌ల‌యాళం మూవీలో సినీ నటి  జ‌యప్ర‌ద‌

సీనియ‌ర్ నటి, రాజకీయ నాయకురాలు జయప్రద తిరిగి మరోసారి తెరంగేట్రం చేయనున్నారు. దాదాపుగా ఆరేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ఓ మలయాళ చిత్రంలో నటిస్తున్న‌ది. ఇప్పటికే ఈ సినిమాకోసం ఆమె కేరళ రాజధాని తిరువ‌నంత‌పురానికి వెళ్లింది. దర్శకుడు ఎంఏ నిషాద్‌ తీయబోతున్న కిన్నారు అనే మలయాళ చిత్రంలో ఆమె కీల‌క‌పాత్ర‌లో క‌నిపించ‌నుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మలయాళ చిత్రం ద్వారా తిరిగి నటనను ప్రారంభించడం తనకు సంతోషంగా ఉందని అన్నారు. తాను నటించబోతున్న ఈ సినిమాలో సామాజిక సమస్య అయిన నీటి సమస్య, రైతుల సమస్యలు ఇతివృత్తంగా ఉండబోతుందని వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com