నాన్న పుట్టినరోజున టీజర్ ను విడుదలచేయనున్న 'స్పైడర్'

- May 12, 2017 , by Maagulf
నాన్న పుట్టినరోజున టీజర్ ను విడుదలచేయనున్న 'స్పైడర్'

మహేశ్ బాబు కొత్త సినిమా టీజర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు అభిమానులు... వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న ఈ చిత్రం టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందట... ఇదిలా ఉంటే మహేశ్ ప్రస్తుతం సమ్మర్ ట్రిప్‌లో ఉన్నాడట? మహేశ్ బాబు తాజా చిత్రం 'స్పైడర్' సినిమాకు సంబంధించి ఏదీ అనుకున్న తేదీకి రావడం లేదు. షూటింగే అనుకున్న తేదీ కంటే ఆలస్యంగా ఆరంభమైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను ఊరించి ఊరించి ఆలస్యంగానే విడుదల చేశారు. ఇక జూన్-23న సినిమా రిలీజ్ ప్రకటించినప్పటికీ జూన్ కాదు కదా జులైలో కూడా ఈ మూవీ రావడం కష్టమేనంటున్నారు. అందుకేనేమో టీజర్ విషయంలో ఇంత వరకూ ఏ డేట్‌ను కన్ఫమ్ చేయలేదు యూనిట్. అయితే మే 31న ఈ సినిమా టీజర్ వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కారణం ఆరోజున కృష్ణ పుట్టినరోజు కావడమే. ప్రతీ సంవత్సరం తండ్రి పుట్టినరోజుకు తన సినిమా ఫస్ట్‌లుక్ లేదా టీజర్‌ను బహుమతిగా ఇస్తోన్న మహేశ్. ఈసారి 'స్పైడర్' టీజర్‌ను రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. 'స్పైడర్' షూటింగ్ విషయానికొస్తే పాట మినహా టాకీ పార్ట్ కంప్లీట్ అయింది.
షూటింగ్స్‌తో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీకే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చే మహేశ్ పిల్లల కోసం ప్రస్తుతం సమ్మర్ హాలీడేస్ ట్రిప్‌లో ఉన్నాడు. ఇందుకోసం ఈసారి గోవాను ఎంచుకున్నాడు మహేశ్. గతంలో 'వన్ నేనొక్కడినే' గోవాలో షూటింగ్ జరుపుకోగా అప్పటినుంచి గోవాతో మహేశ్‌కు అటాచ్‌మెంట్ కుదిరింది. ప్రస్తుతం గోవాలోని అందమైన లొకేషన్స్‌లో తిరుగుతూ హాట్ సమ్మర్‌ను పిల్లలతో కలసి కూల్‌గా ఎంజాయ్ చేస్తున్నాడు మహేశ్.
గోవా నుంచి తిరిగి రాగానే 'స్పైడర్' పాట చిత్రీకరణ జరగనుంది. సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి లేటుగా వచ్చినా లేటెస్ట్‌గా అదరగొట్టేస్తాడేమో చూద్దాం..!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com