శర్వానంద్ తో మూవీ కి రెడీ అవుతున్న సుధీర్ వర్మ
- May 12, 2017
యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అండ్ ఫ్యామిలీ డ్రామాలతో సక్సెస్‌ఫుల్‌గా కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు శర్వానంద్... శుక్రవారం 'రాధ'గా ఆడియన్స్ ముందుకు వచ్చిన శర్వా తన విజయాలకు కొనసాగింపుగా మరిన్ని ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్స్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడట... ఈ యేడాది సంక్రాంతి కానుకగా వచ్చిన 'శతమానం భవతి' కూడా విజయం సాధించడంతో సంక్రాంతి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు శర్వానంద్. అతని తాజా చిత్రం 'రాధ' శుక్రవారం జనం ముందుకొచ్చాడు. లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో శర్వానంద్ పోలీస్ ఆఫీసర్‌గా నటించాడు. ఇదో రొమాంటిక్ లవ్‌స్టోరీ అని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. ప్రస్తుతం శర్వానంద్ మారుతీ దర్వకత్వంలో 'మహానుభావుడు' అనే చిత్రంలో నటిస్తున్నాడు. గతంలో శర్వానంద్ హీరోగా 'రన్ రాజా రన్' మూవీ నిర్మించిన యు.వీ. క్రియేషన్స్ సంస్థ దీనిని నిర్మిస్తోంది. ఇది పూర్తి కాగానే 'స్వామిరారా' ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ సినిమా చేస్తాడట. సుధీర్ వర్మ డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ 'కేశవ' కూడా ఇదే నెలలో మూడోవారం రాబోతోంది.
డెబ్యూ మూవీ 'స్వామి రా రా'తో హిట్‌ను అందుకున్న సుధీర్ వర్మను రెండో సినిమా 'దోచెయ్' తీవ్ర నిరాశకు గురిచేసింది. దాంతో మళ్ళీ నిఖిల్‌తోనే తన మూడో చిత్రం 'కేశవ'ను రూపొందించాడు. రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా రిజల్డ్ గురించి వేచి చూడకుండానే సుధీర్ వర్మ మీద ఉన్న నమ్మకంతో శర్వానంద్ అతను చెప్పిన కథకు ఓకే చెప్పేశాడట! పలు సూపర్ హిట్ చిత్రాలను హారిక అండ్ హాసిని బ్యానర్‌లో నిర్మించిన సుంకర రాధాకృష్ణ ఈ మూవీని ప్రొడ్యూస్ చేయబోతున్నారట.
ఇదిలా ఉంటే 'బాహుబలి' లాంటి మాగ్నమ్ ఓపస్ మూవీని నిర్మించిన ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌లోనూ శర్వానంద్ ఓ సినిమా చేయబోతున్నాడట. కె. రాఘవేంద్రరావు తనయుడు ప్రకాశ్ కోవెలమూడి ఈ మూవీని డైరెక్ట్ చేస్తాడని తెలుస్తోంది. మొత్తం మీద శర్వానంద్‌తో టాప్ ప్రొడక్షన్స్ హౌసెస్ మూవీస్ నిర్మించడం విశేషం.
తాజా వార్తలు
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్‌లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్‌లో డ్రైవర్‌కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్‌లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..







