మక్కా అగ్నిప్రమాదంలో ముగ్గురు కార్మికులు మృతి
- May 12, 2017
ఇటీవల ఎడారి దేశాలలో అగ్నిప్రమాదాలు జోరందుకొని నిండు ప్రాణాలను సజీవ దహనం చేస్తున్నాయి. మక్కాలోని ఒక వడ్రంగి గిడ్డంగిలో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు కార్మికులు కాలి బుగ్గిగా మారేరు. అగ్నిప్రమాద సమాచారం తెలియడం గానే సివిల్ డిఫెన్స్ బృందాలు హజ్ వీధిలోని ఘటనా స్థలానికి తరలించారు.అనంతరం అగ్నిమాపక సిబ్బంది మంటలను నియంత్రణలోనికి తీసుకొచ్చారు. భవనం లోని రెండో అంతస్తులో ఉన్నగిడ్డంగి లోపల అగ్నిప్రమాదం జరిగింది. ఇనుప లోహంతో నిర్మించిన ఒక గదిలో కార్మికులు ఆదమరిచి నిద్రపోతున్నారు. ఒక్కసారిగా అగ్నిజ్వాలలు ఆ ప్రాంతాంన్ని ఒక్కసారిగా చుట్టిముట్టాయి. కార్మికులు నిద్రిస్తున్న ఆ గది లోపలకు వెళ్లేందుకు వచ్చేందుకు కేవలం ఒకే ఒక ఇనుప నిచ్చెన మాత్రమే ఉంది. దీనితో భగ భగలాడుతూ తరుముకొస్తున్న మృత్యువుని తప్పించుకోలేకపోయారు. ఈ అగ్నిప్రమాదం జరిగినపుడు ఆ ఇనుప గదిలో విపరీతమైన వేడి పెరిగి ఆ ముగ్గురు కార్మికులు అక్కడే చనిపోయినట్లు సివిల్ డిఫెన్స్ ప్రతినిధి మేజ్ నయిఫ్ అల్-షరీఫ్ " మా గల్ఫ్ డాట్ కామ్ " ప్రతినిధికి తెలిపారు. అలాగే , ఈ అగ్నిప్రమాదం జరగడానికి గల వాస్తవ కారణం అన్వేషణ కోసం దర్యాప్తు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







