మక్కా అగ్నిప్రమాదంలో ముగ్గురు కార్మికులు మృతి
- May 13, 2017
మక్కా:ఇటీవల ఎడారి దేశాలలో అగ్నిప్రమాదాలు జోరందుకొని నిండు ప్రాణాలను సజీవ దహనం చేస్తున్నాయి. మక్కాలోని ఒక వడ్రంగి గిడ్డంగిలో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు కార్మికులు కాలి బుగ్గిగా మారేరు. అగ్నిప్రమాద సమాచారం తెలియడం గానే సివిల్ డిఫెన్స్ బృందాలు హజ్ వీధిలోని ఘటనా స్థలానికి తరలించారు.అనంతరం అగ్నిమాపక సిబ్బంది మంటలను నియంత్రణలోనికి తీసుకొచ్చారు. భవనం లోని రెండో అంతస్తులో ఉన్నగిడ్డంగి లోపల అగ్నిప్రమాదం జరిగింది. ఇనుప లోహంతో నిర్మించిన ఒక గదిలో కార్మికులు ఆదమరిచి నిద్రపోతున్నారు. ఒక్కసారిగా అగ్నిజ్వాలలు ఆ ప్రాంతాంన్ని ఒక్కసారిగా చుట్టిముట్టాయి. కార్మికులు నిద్రిస్తున్న ఆ గది లోపలకు వెళ్లేందుకు వచ్చేందుకు కేవలం ఒకే ఒక ఇనుప నిచ్చెన మాత్రమే ఉంది. దీనితో భగ భగలాడుతూ తరుముకొస్తున్న మృత్యువుని తప్పించుకోలేకపోయారు. ఈ అగ్నిప్రమాదం జరిగినపుడు ఆ ఇనుప గదిలో విపరీతమైన వేడి పెరిగి ఆ ముగ్గురు కార్మికులు అక్కడే చనిపోయినట్లు సివిల్ డిఫెన్స్ ప్రతినిధి మేజ్ నయిఫ్ అల్-షరీఫ్ " మా గల్ఫ్ డాట్ కామ్ " ప్రతినిధికి తెలిపారు. అలాగే , ఈ అగ్నిప్రమాదం జరగడానికి గల వాస్తవ కారణం అన్వేషణ కోసం దర్యాప్తు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్‌లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్‌లో డ్రైవర్‌కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!







