పుస్తక ప్రదర్శన, సాహిత్య ఉత్సవాన్ని ప్రారంభించనున్న శశి థరూర్
- May 13, 2017
మనామా: ' డబ్భై ఏళ్ళ భారతదేశం మరియు డబ్భై ఏళ్ళ బహ్రెయిన్ కేరళీయ సమాజం ('భారతదేశం @ 70, బి కె ఎస్ @ 70' ) ఉత్సవం ఘనంగా జరపనుంది. ఇందులో భాగంగా, మే 17 వ తేదీ నుండి 27 వ తేదీ వరకు బి కె ఎస్ డైమండ్ జూబ్లీ హాల్లో ఒక అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన, సాహిత్య ఉత్సవాన్ని బహ్రెయిన్ కేరళీయ సమాజం ( బి కె ఎస్),నిర్వహించనుంది. ఈ సమాచారంను బహ్రెయిన్ కేరళీయ సమాజం అధ్యక్షుడు పి.వి. రాధాకృష్ణ పిళ్ళై మరియు ప్రస్తుత జనరల్ సెక్రటరీ మనోహరన్ పావరాటీ ఇటీవల సమాజం వద్ద జరిగిన ఒక విలేకరుల సమావేశంలో తెలిపారు.ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ మరియు భారతదేశ పార్లమెంట్ సభ్యుడు శశి థరూర్ మే 17 వ తేదీన బహ్రెయిన్ కేరళీయ సమాజం నిర్వహిస్తున్న పుస్తక ప్రదర్శన, సాహిత్య ఉత్సవాన్ని ప్రారంభించనున్నారు. భారత్ లో బ్రిటీష్ సామ్రాజ్యంపై శశి థరూర్ రాసిన ' ఎరా అఫ్ డార్క్ నెస్ ' పుస్తకాన్ని ఈ కార్యక్రమంలో విడుదల చేయనున్నారు.పర్యావరణ కార్యకర్త డాక్టర్ వందన శివ, కెరీర్ గురు బి.ఎస్.వాయర్ర్, రచయితలు డా. రవికుమార్ మరియు మనోజ్ కురోర్ బుక్ ఫెయిర్ అండ్ లిటరరీ ఫెస్ట్స్ కు హాజరవుతారు. డాక్టర్. వందన శివ మే 18 న పర్యావరణ సమస్యలపై మాట్లాడతారు. చిన్న కథ రచన పోటీలు, సాహిత్య క్విజ్ మరియు కెరీర్ గురు బి.ఎస్.వాయర్యర్ నేతృత్వంలోని క్యారియర్ మార్గదర్శక తరగతులు జరుగుతాయి. ఒక సాహిత్య శిభిరం కూడా మే 25 మరియు 26 న మనోజ్ కురోర్ మరియు డాక్టర్ కే .ఎస్ రవికుమార్ ఆధ్వర్యంలో జరగనున్నాయి. పుస్తక ప్రదర్శన, సాహిత్య ఉత్సవంలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్నవారు తమ పేరు నమోదు మరియు ఇతర వివరాల కోసం 39744981, లేదా 32052047 కు ఫోన్ చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.
తాజా వార్తలు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత







