మలబద్ధకానికి స్వాభావికమైన మందు మామిడి పండు
- May 13, 2017
వేసవి సీజన్‌లో విరివిగా లభించే పండ్లు మామిడి పండ్లు. ఇది మామిడి పండ్ల సీజన్ కావడంతో విరివిగా లభిస్తాయి. బంగారపు రంగులో మిసమిసలాడే ఈ పండ్లు నిజంగానే బంగారమంటున్నారు పరిశోధకులు. అలాంటి మామిడి పండును ఆరగిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాంటి మామిడి పండులో క్యాలరీల శక్తి, ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, చక్కెర, పీచు పదార్థం ఇలా అనేక పుష్కలమైన పోషకాలు ఉంటాయి.
ఈ పండును ఆరగించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా.. మామిడిలో పీచు పదార్థం ఎక్కువ కాబట్టి మలబద్ధకానికి ఇది స్వాభావికమైన మందుగా పరిగణిస్తారు. మామిడి పెద్ద పేగుకు క్యాన్సర్ వచ్చే అవకాశాలను సమర్థంగా నివారిస్తుంది. కంటిచూపును మెరుగుపరిచేందుకు అవసరమైన బీటా–కెరొటిన్ మామిడిలో పుష్కలంగా ఉంటుంది.
మామిడిలో ఉండే పొటాషియమ్ కారణంగా అది గుండెజబ్బుల (కార్డియో వాస్క్యులార్ డిసీజెస్)నూ, రక్తపోటునూ నివారిస్తుంది. మామిడిలోని బీటా కెరొటిన్ పోషకమే ప్రోస్టేట్ క్యాన్సర్‌తో పాటు... రొమ్ము, లుకేమియా వంటి అనేక క్యాన్సర్ల నివారణకూ తోడ్పడుతుంది.
తాజా వార్తలు
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!









