ఇరాన్‌లో భూకంపం

- May 14, 2017 , by Maagulf
ఇరాన్‌లో భూకంపం

టెహ్రాన్‌: ఇరాన్‌లో ఆదివారం భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 5.7గా నమోదైంది. ఉత్తర ఖోరాసన్‌ ప్రావిన్స్‌లోని బోజ్నుర్డ్‌ నగరంలో ప్రకంపనలు సంభవించాయి.ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా 300 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. 40 శాతం ఇళ్లు నేలమట్టమయ్యాయి. తుర్క్‌మెనిస్థాన్‌ సరిహద్దుకి 50 కిమీల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. 2003లో ఇరాన్‌లోని బామ్‌ ప్రాంతంలో సంభవించిన భూకంప ఘటనలో 31,000 మంది ప్రాణాలు కోల్పోయారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com