స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కారు ధ్వంసం: పోలీస్ స్టేషన్లో పంచాయితీ!
- May 14, 2017
అల్లు అర్జున్ కారు ధ్వంసం కేసుకు సంబంధించి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో జరిగిన పంచాయితీ హాట్ టాపిక్ అయింది. అల్లు అర్జున్ కారును ఢీ కొట్టిన క్యాబ్ డ్రైవర్.... డబ్బులు కట్టమని అడిగితే పోలీసులను ఆశ్రయించడమే ఈ పంచాయితీకి కారణం.
అల్లు అర్జున్ కారును శనివారం రాత్రి జూబ్లీహిల్స్ రోడ్ నెం.1 నుంచి వెళ్తుండగా ఓ క్యాబ్ వెనక్కి తీసే క్రమంలో ఆయన కారుకు తగిలింది. కారు ధ్వంసం అయింది కాబట్టి మరమ్మత్తులకు డబ్బులు ఇవ్వాలంటూ.... అల్లు అర్జున్ కారు డ్రైవర్ మహిపాల్ క్యాబ్ డ్రైవర్ రామకృష్ణను రూ. 2 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం.
ఇపుడు తన వద్ద డబ్బులు లేని, ఆదివారం ఉదయం వచ్చి డబ్బులు ఇస్తానని సదరు క్యాబ్ డ్రైవర్ తన క్యాబ్ ను అల్లు అర్జున్ ఇంటి వద్ద వదిలి వెళ్లిపోయాడు.
కారు మరమ్మత్తు ఖర్చు రూ.2 లక్షలు అవుతుందని మహిపాల్ తెలపడంతో అంత చెల్లించుకోలేనని చెప్పిన రామకృష్ణ ఆదివారం జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ ను ఆశ్రయించాడు. అల్లు అర్జున్ కారు డ్రైవర్ తనను డబ్బుల కోసం ఇబ్బంది పెడుతున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసాడు.
అంత సీరియస్ ఇష్యూ కాక పోవడంతో రామకృష్ణ ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. మహిపాల్‌ను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి ఇద్దరు డ్రైవర్లతో మాట్లాడారు ఎలాంటి కేసు లేకుండా ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు. ఈ వ్యవహారంలో అల్లు అర్జున్ జోక్యం చేసుకున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







