బాహుబలి 2 స్పెషల్ షో వేయించిన నిజామాబాద్ ఎంపీ కవిత
- May 14, 2017
రిలీజై మూడు వారాలైనా బాహుబలి2 మానియా తగ్గడంలేదు. చిన్నా,పెద్దా, ముసలి ముతకతోపాటు, పలువురు రాజకీయ ప్రముఖులు కూడా ఈ సినిమాని చూస్తూ తమ అభిప్రాయాల్ని వెల్లడిస్తున్నారు. తాజాగా టీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపి కవిత పొతంగల్ గ్రామస్తులకు బాహుబలి2 సినిమా ప్రత్యేక షో వేయించి చూపించారు.
మాతృదినోత్సవం పురస్కరించుకుని హైదరాబాద్ నుంచి స్పెషల్ గా తెప్పించిన ఈక్విప్‌మెంట్‌తో స్థానిక స్కూల్‌లో పెద్ద తెరపై ఈ సినిమా ప్రదర్శించారు. కవిత కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలిసి సినిమా వీక్షించారు. సినిమా చూడ్డం కోసం మహిళలు ఇళ్లకు తాళాలు వేసి మరీ స్కూలు వద్దకు వచ్చి అంతా కలిసి ఆనందంగా సినిమా సంబరాన్ని జరుపుకున్నారు.
తాజా వార్తలు
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!







