తనయుడ్ని హతమార్చిన తల్లికి జైలు
- May 15, 2017
14 నెలల చిన్నారి మృతికి కారకురాలైన కేసులో దుబాయ్‌కి చెందిన ఓ మహిళకు జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. పదే పదే చిన్నారిని కొట్టడం, ఆ చిన్నారి పొట్ట మీద చేతి వేళ్ళతో బలంగా గుచ్చడం వంటి చర్యలతో తీవ్రమైన బాధతో చిన్నారి విలవిల్లాడిపోయేవాడని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. నిందితురాలి సోదరి సైతం, నిందితురాలికి వ్యతిరేకంగానే విచారణలో వాస్తవాలు వెల్లడించడంతో న్యాయస్థానం నిందితురాలికి మూడేళ్ళ జైలు శిక్ష విధించింది. పలుమార్లు ఆ చిన్నారిని తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేర్చారని, ఆ చిన్నారికి పలు సందర్భాల్లో చికిత్స అందించిన వైద్యులు తెలిపారు. ఇంకో వైపున నిందితురాలి భర్త లేని సమయంలోనే చిన్నారి బాగా ఏడ్చేవాడనీ, అప్పుడే ఆ చిన్నారిపై దాడులు జరుగుతుండేవని విచారణలో తేలింది. ఓ సందర్భంలో, చిన్నారి పొట్టపై నిందితురాలు గట్టిగా చేతితో గుచ్చడాన్ని తానుకూడా చూసినట్లు మెయిడ్ విచారణలో తెలిపింది. అంతర్గత రక్తస్రావంతోనే చిన్నారి మృతి చెందాడనీ, దానికి కారణం పొట్టపై బలంగా గుచ్చడమేనని వైద్యులు తేల్చారు. అయితే తన క్లయింటు ఎలాంటి కుట్రపూరిత చర్యకు పాల్పడలేదని నిందితురాలి తరఫు లాయర్ వాదించినా, న్యాయస్థానం పలువురు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించిన విషయాలను పరిగణనలోకి తీసుకుని తీర్పునిచ్చింది.
తాజా వార్తలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్‌పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!









