రూ.1,031లకే ఎయిర్ఏషియా విమాన టికెట్
- May 15, 2017
దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ఏషియా తన విమానాల్లో ప్రయాణించే వారికి ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఎంపిక చేసిన రూట్లలో అతి తక్కువ ధరకు టికెట్లు అందించనుంది. ‘బై నౌ.. ఫ్లై నౌ’ పేరుతో తీసుకొచ్చిన ఈ పథకంలో ప్రారంభ ధర రూ.1,031లకే విమాన టికెట్‌ను అందిస్తోంది. మే 21 వరకూ అందుబాటులో ఉండే ఈ పథకం ద్వారా టికెట్లు బుక్ చేసుకున్న వారు సెప్టెంబర్ 4, 2017లోపు ప్రయాణించాల్సి ఉంటుంది. రాంచి-కోల్‌కతా(రూ.1,220), గోవా-హైదరాబాద్(1,237) న్యూదిల్లీ-శ్రీనగర్(రూ.2,062) రూట్లలో అతి తక్కువ ధరకు టికెట్లు లభించనున్నాయి. ఈ మేరకు తన వెబ్సైట్లో పూర్తి వివరాలను ఎయిర్ఏషియా అందుబాటులో ఉంచింది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







