రమదాన్‌ 2017: పనివేళలు ఇవే

- May 15, 2017 , by Maagulf
రమదాన్‌ 2017: పనివేళలు ఇవే

మూన్‌సైట్‌ ప్రకారం 27 మే నుంచి 24 జూన్‌ వరకు రమదాన్‌ మాసం ఉండనుంది. ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు రమదాన్‌ మాసం సందర్భంగా ఉపవాస దీక్షలు చేస్తారు. సూర్యోదయం నుంచి సూర్యాస్థమయం వరకు ఈ ఉపవాస దీక్షలు ఉంటాయి. రమదాన్‌లో ఉపసవాస దీక్ష చేయడం అనేది ఇస్లాంలో ఐదవ పిల్లర్‌గా భావిస్తారు. బిలీఫ్‌, వర్షిప్‌, ఛారిటబుల్‌ గివింగ్‌, హజ్‌ - మక్కా పవిత్ర యాత్ర మిగతా నాలుగు ముఖ్యమైన పిల్లర్స్‌. ముస్లింలు తమ జీవితంలో ఒక్కసారైనా మక్కా యాత్ర చేయాలని దృఢ సంకల్పంతో ఉంటారు. ఇంకో వైపున ఉపవాస దీక్షలు ప్రశాంతంగా సాగేందుకోసం, ఖతారీ ప్రభుత్వం తగు చర్యలు చేపడుతూ వస్తోంది. ప్రభుత్వం, పనివేళల్ని తగ్గించడం ద్వారా ఉద్యోగులు, కార్మికులకు ఉపవాస దీక్షల సందర్భంగా వెసులుబాటు కల్పిస్తోంది. తద్వారా వారిపై పని ఒత్తిడి కొంత మేర తగ్గి, ఆ సమయాన్ని ప్రశాంతతో గడుపుతారు. ఈ నేపథ్యంలో జారీ చేసిన తాజా సర్క్యులర్‌ ద్వారా పనివేళల్ని నిర్ధారించారు. సివిల్‌ వర్కర్స్‌కి రోజుకి ఐదు గంటలు మాత్రమే పని వేళలుగా నిర్ధారించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పని వేళల్ని నిర్ణయిస్తూ సర్క్యులర్‌ జారీ చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com