ప్రధాన మంత్రి హత్యకేసుని ఇన్వెస్టిగేషన్ చేయబోతున్న భల్లాలదేవుడు
- May 16, 2017
పవర్ ఫుల్ సబ్జెక్ట్స్ కు సూపర్ హీరోలా మారుతున్నాడు రానా. తెలుగు,తమిళ్ అనే బాషా బేధం లేకుండా మల్టీ మార్కెట్ ను టార్గెట్ చేస్తోన్న భారీ సినిమాలకు స్టార్ హీరో అవుతున్నాడు భళ్లాలుడు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓ మర్డర్ కేసు మూవీలో నటించబోతున్నాడు దగ్గుబాటి లీడర్.
రానా కు బాహుబలి-2లో నెగటివ్ రోల్ చేసినా బోల్డంత ఫాలోయింగ్ వచ్చింది. నేషనల్ వైడ్ గా మార్కెట్ క్రియేట్ అయ్యింది. దీంతో ఇండియన్ వుడ్స్ అన్నింటిని టార్గెట్ చేస్తూ భారీ సినిమాలు తీసే మేకర్స్ కు భళ్లాలుడు ఫస్ట్ ఛాయిస్ అవుతున్నాడు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసును ఇన్వెస్టిగేషన్ చేసిన సిబిఐ ఆఫీసర్ డి.ఆర్.కార్తికేయన్ పాత్ర చెయ్యబోతున్నాడు రానా.
కన్నడ మేకర్ ఎ.ఎమ్.ఆర్.రమేశ్.. అస్పోట-ద హ్యూమన్ బాంబ్ అనే పేరుతో రాజీవ్ గాంధీ హత్యకేసును తెరకెక్కించాలనుకుంటున్నాడు. కన్నడతో పాటు తెలుగు,తమిళ్,మలయాళం,హిందీ భాషల్లో ఈసినిమా రాబోతోంది. అందుకే అన్ని ఏరియాస్ లో గుర్తింపు ఉన్న రానాని మెయిన్ రోల్ కు తీసుకోవాలనుకుంటున్నాడు దర్శకుడు. ఇప్పటికే రానాతో స్టోరీ డిస్కషన్స్ కూడా నడిచాయని బెంగళూర్ లో టాక్ వినిపిస్తోంది. అయితే ఇంతకు ముందు జాన్ అబ్రహం ఇదే స్టోరీతో మద్రాస్ కేఫ్ ని నిర్మించాడు. మరి ఈ హ్యూమన్ బాంబ్ ఎవరి ప్రాస్పెక్టివ్ లో తెరకెక్కుతుంది? మద్రాస్ కేఫ్ కంటే ఎంత వైవిధ్యంగా ఉంటుందో చూడాలి మరి.
తాజా వార్తలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!







