విస్తారా ఎయిర్ లైన్స్ సమ్మర్‌ ఆఫర్‌

- May 16, 2017 , by Maagulf
విస్తారా ఎయిర్ లైన్స్  సమ్మర్‌ ఆఫర్‌

వేసవి సెలవుల్లో ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఆఫర్ల బాట పట్టాయి పలు విమానయాన సంస్థలు. ఇప్పటికే స్పైస్‌జెట్‌, ఇండిగో, ఎయిర్‌ఏషియా, గోఎయిర్‌ లాంటి సంస్థలు తక్కువ ధరలతో విమాన టికెట్లు ఆఫర్‌ చేస్తుండగా.. తాజాగా విస్తారా కూడా ఈ జాబితాలో చేరింది. రూ. 999 ప్రారంభ టికెట్‌ ధరతో ‘మిడ్‌-సమ్మర్‌’ సేల్‌ను ప్రకటించింది.
దేశీయ విమానాల్లో రూ. 999 ప్రారంభ ధరతో ఈ ఆఫర్‌ను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్‌ కింద జమ్ము-శ్రీనగర్‌, గువాహటి-బగ్దోగ్రా టికెట్‌ ధర రూ. 999గా ఉంది. ఇక దిల్లీ-చండీగఢ్‌కు రూ. 1,499, దిల్లీ-లఖ్‌నవూకు రూ. 1,549, దిల్లీ-అమృత్‌సర్‌కు రూ. 1,699 చొప్పున టికెట్‌ ధరలు ప్రకటించింది. మే 20 వరకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. జూన్‌ 12, 2017 నుంచి ఫిబ్రవరి 20, 2018 మధ్య విస్తారా విమానాల్లో ప్రయాణించే వారికి ఈ ఆఫర్‌ వర్తిస్తుందని సంస్థ పేర్కొంది.
అయితే ఈ ఆఫర్‌ కింద పరిమిత సంఖ్యలో సీట్లను కేటాయించింది. కేవలం ఎకానమీ క్లాస్‌లోనే ఈ డిస్కౌంట్‌ వర్తిస్తుందని తెలిపింది. ఇటీవలే ఆఫర్డబుల్‌ లగ్జరీ సేల్‌ కింద బిజినెస్‌ క్లాస్‌ టికెట్‌ ధరలను విస్తారా 50శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com