అల్పాదాయ కుటుంబాలకు రమదాన్‌ 'కానుక'

- May 16, 2017 , by Maagulf
అల్పాదాయ కుటుంబాలకు రమదాన్‌ 'కానుక'

మనామా: ప్రైమ్‌ మినిస్టర్‌ ప్రిన్స్‌ ఖలీఫా బిన్‌ సల్మాన్‌ అల్‌ ఖలీఫా, సోషల్‌ మరియు హ్యాండిక్యాప్‌ అలవెన్సుల్ని రమదాన్‌ సందర్భంగా రెండింతలు చేయాలని ఆదేశించారు. గుడైబియా ప్యాలెస్‌లో జరిగిన వీక్లీ క్యాబినెట్‌ సెషన్‌లో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అల్పాదాయం గల పౌరులకు సామాజిక భద్రత కల్పించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అలాగే, క్యాబినెట్‌లో 'సైబర్‌ ఎటాక్‌'పైనా చర్చ జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా సైబర్‌ దాడుల నేపథ్యంలో, తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై చర్చించారు. అలాగే, నార్తరన్‌ సిటీ ప్రాజెక్ట్‌లోని బిలాద్‌ అల్‌ ఖదీమ్‌, అల్‌ జింజ్‌ విలేజర్స్‌కి సంబంధించిన హౌసింగ్‌ నీడ్స్‌పైనా డైరెక్షన్స్‌ ఇచ్చారు ప్రీమియర్‌. ఇంకో వైపున, మీడియా, జర్నలిస్టులకు గవర్నమెంట్‌ డిపార్ట్‌మెంట్స్‌ సముచిత స్థానం ఇవ్వాలని ప్రీమియర్‌ సూచించారు. జిసిసి దేశాల మధ్య సఖ్యత కోసం కాన్ఫరెన్స్‌లు, ఎగ్జిబిషన్స్‌ విరివిగా జరగాల్సి ఉందని ప్రీమియర్‌ చెప్పారు. ప్రైవేట్‌, పబ్లిక్‌ సెక్టార్స్‌లోని బహ్రెయినీ ఉద్యోగుల భద్రతకు సంబంధించి కూడా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది క్యాబినెట్‌. సమాజంలో మహిళల పాత్రకు సంబంధించి రీజినల్‌ వర్క్‌ షాప్‌ నిర్వహణపైన కూడా క్యాబినెట్‌ చర్చించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com