అత్తిపళ్ల కేక్‌

- May 16, 2017 , by Maagulf
అత్తిపళ్ల కేక్‌

కావలసిన పదార్థాలు: అత్తిపళ్లు - 4 (అర ముక్కలుగా కట్‌ చేయాలి), బటర్‌ - అరకప్పు, పంచదార పొడి - 2 కప్పులు, గుడ్లు - 4, మైదా - 1 కప్పు, బేకింగ్‌ పౌడర్‌ - అర టీ స్పూను, బాదం (చిన్న పలుకులు) - అర కప్పు, దాల్చినచెక్క పొడి - అర టీ స్పూను. 
తయారుచేసే విధానం: 8 అంగుళాల చుట్టుకొలత ఉన్న టిన్‌ అడుగున వెన్నరాసి, అక్కడక్కడ అత్తిపళ్లను బోర్లించాలి. వేరే గిన్నె తీసుకుని బటర్‌, పంచదార, గుడ్లు, బేకింగ్‌ పౌడర్‌, బాదం పలుకులు, దాల్చినచెక్కపొడి అన్నీ బాగా కలిసేలా గిలకొట్టాలి. ఈ మిశ్రమాన్ని అత్తిపళ్ల టిన్‌లో పోసి 350 డిగ్రీల వద్ద ‘ప్రీ హీట్‌’ చేసుకున్న ఓవెన్‌లో గంటసేపు ఉంచాలి. టూత్‌పిక్‌తో చెక్‌ చేసుకుని, చల్లారిన తర్వాత బోర్లించి ముక్కలు కట్‌ చేసుకోవాలి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com