హైదరాబాద్ లో సినీ దర్శకుడి అపహరణ.. విడుదల
- May 16, 2017
ఓ సినీ దర్శకుడిని కిడ్నాప్ చేయగా పోలీసుల జోక్యంతో విడుదల చేశారు. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందిరానగర్‌కు చెందిన సినీ దర్శకుడు విజయ్‌రెడ్డి గతేడాది అక్టోబరులో అల్మాస్‌గూడకు చెందిన నరేశ్ వద్ద వోక్స్‌వ్యాగన్ కారును రూ.5.50లక్షలకు కొనుగోలు చేశాడు. ముందస్తుగా రూ50వేలు ఇచ్చారు. మిగతా బకాయి రూ.5లక్షలు పక్షం రోజుల్లో ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటానని నమ్మించాడు. ఆ తరువాత కారుకు సంబంధించిన ఈఎంఐ నాలుగు వాయిదాలు కట్టాడు. బకాయి డబ్బుల విషయమై పలుమార్లు అడిగినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో మంగళవారం నరేశ్ తన ముగ్గురు స్నేహితులతో కారులో వచ్చి ఇందిరానగర్‌లో ఉన్న విజయ్‌రెడ్డిని బలవంతంగా కారులో ఎక్కించుకుని అల్మాస్‌గూడకు తీసుకెళ్లారు. అక్కడ దర్శకుడిని బెదిరించి, గాయపరిచారు. కిడ్నాప్ విషయమై ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ మహేందర్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులకు విజయ్‌రెడ్డిని తీసుకెళ్లిన వారితో మాట్లాడి తీసుకొచ్చేలా చేశారు. కిడ్నాప్‌కు పాల్పడిన నరేశ్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- భారత్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు
- మళ్లీ తగ్గిన బంగారం ధర..పసిడి ప్రియులకు కాస్త ఊరట
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!
- సల్మాబాద్‌లోని గ్యారేజీని దోచుకున్న ఫేక్ పోలీసులు..!!
- బ్యాడ్మింటన్ గేమ్ ఆడుతూ..కేరళ వాసి మృతి..!!
- దక్షిణ అల్ బటినాలో ఫ్రాడ్ సస్పెక్ట్ అరెస్ట్..!!
- ఖతార్ లో 7 శాతం పెరిగిన FDI లు..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఎయిర్ ఫెయిర్స్ కు రెక్కలు..!!
- ఆన్లైన్ కంటెంట్‌కు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు బాధ్యత వహించాలి: మంత్రి వైష్ణవ్
- గన్నవరంలో ఈ నెల 28న జాబ్ మేళా









