గ్రూప్‌-1 అధికారిగా బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పి.వి.సింధు

- May 16, 2017 , by Maagulf
గ్రూప్‌-1 అధికారిగా  బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పి.వి.సింధు

బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పి.వి.సింధును గ్రూప్‌-1 అధికారిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నియమించనుంది. నియామకంలో ఉన్న ప్రతిబంధకాన్ని తొలగించడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ (ప్రభుత్వ సర్వీసుల్లో నియామకాల నియంత్రణ, సిబ్బంది నమూనా హేతుబద్దీకరణ, వేతన విధానం) సవరణ బిల్లును శాసనసభ మంగళవారం ఆమోదించింది. ఆర్థిక, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన ఈ బిల్లు.. రైతులకు న్యాయం చేయాలన్న వైకాపా సభ్యుల నినాదాల మధ్యే సభ ఆమోదం పొందింది. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన పి.వి.సింధును యువత స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆకాంక్షించారు. సింధును గ్రూప్‌-1 అధికారిగా ప్రభుత్వ సర్వీసులోకి తీసుకుని సబ్‌కలెక్టర్‌గా క్రీడల బాధ్యత అప్పగించాలని అనుకుంటున్నట్లు తెలిపారు. వ్యవస్థాపరమైన అడ్డంకులను అధిగమించేందుకు సవరణ బిల్లును సభలో పెట్టినట్లు తెలిపారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. బిజేపీ పక్ష నేత విష్ణుకుమార్‌రాజు సవరణ బిల్లుకు మద్దతు ప్రకటించారు.
‘అ’ అంటే...

ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం, ఆనందం ముఖ్యమని చంద్రబాబునాయుడు ఈ సందర్భంగా అన్నారు. సభలో ఆందోళన చేస్తున్న వైకాపా సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజలు అంతా గమనిస్తున్నారని పేర్కొన్నారు. ‘అ’ అంటే అమ్మ. ‘ఆ’ అంటే ఆంధ్రప్రదేశ్‌.

‘అ’ అమరావతి. ‘ఆ’ ఆరోగ్యం, ఆనందంగా అభివర్ణించారు. వస్తు సేవల బిల్లు (జీఎస్టీ)ను కూడా వ్యతిరేకించిన వారిని ఏమనాలి? కొంతమంది తప్పులు చేసి జీవితాంతం బాధపడుతూ వేరే వాళ్లను బాధ పెట్టే ప్రయత్నం చేస్తారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com