గుర్షా దుబాయ్‌: ఆఫ్రో థర్స్‌డేస్‌

- May 17, 2017 , by Maagulf
గుర్షా దుబాయ్‌: ఆఫ్రో థర్స్‌డేస్‌

 పామ్‌ జుమైరాలోని ప్రముఖ క్లబ్‌ విస్టా మెరెలో కొలువుదీరిన ఇథియోపియన్‌ ఫ్యామిలీ ఫ్రెండ్లీ రెస్టారెంట్‌ గుర్షా దుబాయ్‌, ఆఫ్రో థర్స్‌డేస్‌ పేరుతో వీక్లీ ఎంటర్‌టైన్‌మెంట్‌ నైట్‌ కాన్సెప్ట్‌ని అందుబాటులోకి తెచ్చింది. సాయంత్రం 6 గంటల నుంచి ఈ ఆఫ్రో థర్స్‌డేస్‌ వీక్లీ ఎంటర్‌టైన్‌మెంట్‌ నైట్‌ ప్రారంభమవుతుంది. ఆఫ్రో ఫంక్‌, రెగ్టాఇయాన్‌, డాన్స్‌ హాల్‌, ఆఫ్రో బీట్స్‌, హిప్‌ హాప్‌ సహా పలు కార్యక్రమాలు ఇక్కడ ప్రధాన ఆకర్షణ కానున్నాయి. సంప్రదాయ అఫ్రో డ్రమ్స్‌కి డిజె బీట్స్‌ని మిక్స్‌ చేసి, సందర్శకులకు అద్భుతమైన అనుభూతిని అందివ్వనున్నారు. సంప్రదాయ వంటకాలతోపాటుగా, ప్రీమియమ్‌ మరియు హౌస్‌ బెవరేజెస్‌ మరో ప్రధాన ఆకర్షణ. అఫ్రో థర్స్‌డేస్‌ గురించి ఎగ్జిక్యూటివ్‌ చెఫ్‌ బీడె వోర్కె మాట్లాడుతూ, ఇథియోపియన్‌ సంప్రదాయాల్ని యూఏఈ వాసులకు పరిచయం చేసే క్రమంలో అత్యద్భుతమైన ఎంటర్‌టైన్‌మెంట్‌ని జోడించి ఈ న్యూ కాన్సెప్ట్‌ని డిజైన్‌ చేశామన్నారు. ప్రతి గురువారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు గుర్షా దుబాయ్‌, క్లబ్‌ విస్టా మారె, పామ్‌ జుమైరాలో ఈ అనుభూతిని పొందవచ్చు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com