సెంటిమెంట్ ఫాలో అవుతున్న డైరెక్టర్ సుకుమార్
- May 17, 2017
లెక్కల మాస్టార్ సుకుమార్ కూడా సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు. దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుకుమార్, నిర్మాతగాను ఘనవిజయం సాధించాడు. రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ హీరోయిన్లుగా తెరకెక్కిన కుమారి 21ఎఫ్ సినిమాతో తొలిసారిగా నిర్మాతగా మారిన సుకుమార్, తొలి ప్రయత్నంలోనే సూపర్ హిట్ కొట్టాడు. కుమారి 21 ఎఫ్ రిలీజ్ సమయంలో ఎన్టీఆర్తో నాన్నకు ప్రేమతో సినిమా పనుల్లో ఉన్న సుక్కు.. కుమారి టీజర్ను ఎన్టీఆర్ చేతుల మీదుగా రిలీజ్ చేయించాడు.
దీంతో ఎన్టీఆర్ రిలీజ్ చేయటం సుకుమార్కు సెంటిమెంట్గా మారిపోయింది. అందుకే తన నిర్మాణంలో వస్తున్న రెండో సినిమా దర్శకుడు టీజర్ను కూడా ఎన్టీఆర్ చేతుల మీదుగా రిలీజ్ చేయించేందుకు ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న దర్శకుడు సినిమా టీజర్ ఈ నెల 22న ఓ ప్రముఖ హీరోగా చేతుల మీదుగా రిలీజ్ చేస్తామాని చిత్రయూనిట్ ప్రకటించింది. అయితే ప్రముఖ హీరో ఎన్టీఆరే అని భావిస్తున్నారు. మరి నిజంగానే సుక్కు సెంటిమెంట్ ఫాలో అయి ఎన్టీఆర్తో రిలీజ్ చేయిస్తాడా..? లేక రామ్ చరణ్తో సినిమా చేస్తున్నాడు కాబట్టి చరణ్ చేతుల మీదుగా టీజర్ లాంచ్ చేయిస్తాడా..? తెలియాలంటే 22 వరకు వెయిట్ చేయాల్సిందే.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







