నగల దొంగల అరెస్ట్‌

- May 18, 2017 , by Maagulf
నగల దొంగల అరెస్ట్‌

దుబాయ్‌ పోలీసులు, నగల దొంగల ముఠాని అరెస్ట్‌ చేశారు. 10 మిలియన్‌ దిర్హామ్‌ల విలువైన 'ప్రెసియస్‌ స్టోన్స్‌'ని అల్‌ బర్షాలోని ఓ యూరోపియన్‌ కంపెనీ నుంచి ఈ ముఠా దొంగతనం చేసింది. ముగ్గురు ఆసియా జాతీయులు ఈ ముఠాగా ఏర్పడి ఈ దొంగతనానికి పాల్పడ్డారు. విలువైన జెమ్‌స్టోన్స్‌ తస్కరణకు గురైనట్లుగా గుర్తించిన సంస్థ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు విచారణ చేపట్టారు. ఓనర్‌ కుమారుడితో కలిసి ముఠా సభ్యుల్లో ఒకరు సంస్థలోకి వెళ్ళినట్లుగా సీసీ టీవీ విజువల్స్‌ని బట్టి తేలింది. దేశం నుంచి పారిపోయేందుకు నిందితులు ప్రయత్నిస్తుండగా వారిని పోలీసులు పట్టుకున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com