వడ్డీ రేట్ల ఘాటు కాస్త తగ్గింది

- May 18, 2017 , by Maagulf
వడ్డీ రేట్ల ఘాటు కాస్త తగ్గింది

యాక్సిస్‌ బ్యాంకు గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఎస్‌బిఐ, ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్‌డిఎఫ్‌సిలు ఈ రంగం వడ్డీ రేట్లకు కోత పెట్టిన విషయం తెలిసిందే. కాగా యాక్సిస్‌ బ్యాంకు పరిశ్రమలోనే అతి తక్కువ వడ్డీ రేట్లను అందిస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం యాక్సిస్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్లను 30 బేసిస్‌ పాయింట్ల మేర కోత పెట్టింది. దీంతో రూ.30లక్షల లోపు గహరుణాలపై 8.35శాతం వడ్డీని వసూలు చేయనుంది. మే 16 నుంచి కొత్తగా సమీక్షీంచిన వడ్డీ రేట్లు అమల్లోకి వచ్చాయి. స్వయం ఉపాధి పొందే వర్గాలకు మాత్రం రూ.30లక్షలలోపు గహరుణాలపై వడ్డీ రేటును 8.40 శాతంగా నిర్ణయించింది. రూ. 30లక్షల నుంచి రూ.75లక్షల లోపు విలువైన గహరుణాలు వేతన వర్గాలకు 8.65శాతానికి, స్వయం ఉపాధి పొందే వర్గాలకు 8.70శాతంగా నిర్ణయించింది. పరిశ్రమలోనే ఇవే అత్యంత కనిష్టస్థాయి వడ్డీ రేట్లని ఆ బ్యాంకు పేర్కొంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com