అమెరికాలో రోడ్డు ప్రమాదం : తెలుగు మహిళ నాగమణి మృతి
- May 18, 2017
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలుగు మహిళ నాగమణి మృతిచెందారు. వివరాలు.. అట్లాంటాలోని న్యూటన్ కౌంటీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగమణి తలకు తీవ్రగాయాలయ్యాయి. హుటాహుటిన పీడ్‌మోన్ట్ న్యూటన్ ఆసుపత్రికి ఆమెని తరలించారు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే నాగమణి మృతిచెందారు. హెన్రీ కౌంటీలో నాగమణి టీచర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె భర్త శంభు ప్రసాద్ తనికెళ్ల ప్రస్తుతం భారత్‌లోనే ఉన్నారు. సమాచారం తెలుసుకున్న కుమారుడు భరద్వాజ అట్లాంటాకు బయలుదేరారు.
ఆటా టీం ఘటనా స్థలికి చేరుకొని సహాయ కార్యక్రమాలు చేపట్టింది. కరుణ్ ఆసిరెడ్డి, శివకుమార్, అనిల్ బోడిరెడ్డిలు ఆటా నుంచి కావాల్సిన సహాయసహకారాలు అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







