యూఎస్ నిర్బంధంలో ఉన్న58ఏళ్ల భారతీయుడు మృతి
- May 19, 2017
అమెరికా ఇమిగ్రేషన్ అధికారుల అదుపులో ఉన్న భారత్‌కు చెందిన 58ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. మే 10న ఈక్వెడార్ నుంచి అట్లాంటా వచ్చిన అతుల్‌కుమార్ బాబుభాయ్ పటేల్ భారతీయుడిని విమానాశ్రయంలోనే నిర్బంధించారు. ఇమిగ్రేషన్ పత్రాలు సరిగా లేవనే ఆరోపణలతో పటేల్‌ను యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం ఆయనను ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు అప్పగించారు. రెండు రోజుల పాటు పటేల్‌ను అట్లాంటా సిటీలోని డిటెన్షన్ సెంటర్‌లో నిర్బంధించి ఉంచారు.
పటేల్‌కు డయాబెటిస్, అధిక రక్తపోటు ఉండటంతో అనారోగ్యానికి గురయ్యాడు. ఆయన్ని పరీక్షించిన నర్సు పటేల్‌కు బ్లడ్ షుగర్ ఎక్కువగా ఉందని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడని అధికారులకు చెప్పడంతో వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి చేరకుండానే ఆయన ప్రాణాలు విడిచారు. పటేల్ మృతి గురించి అధికారులు అమెరికాలోని భారత ప్రతినిధులకు, ఆయన కుటుంబానికి సమాచారాన్ని చేరవేశారు. తమ అదుపులో ఉన్న వ్యక్తులు చనిపోయిన ఘటనలు చాలా అరుదుగా ఉన్నాయని ఇమిగ్రేషన్ అధికారులు చెప్పుకొచ్చారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







