2001 కంటే ముందు పాస్‌పోర్టు రీ ఇష్యూ చేయించుకోవాలి
- October 07, 2015
దేశంలో మిషన్ రీడబుల్ పాస్‌పోర్టును కేంద్ర విదేశీవ్యవహారాల మంత్రిత్వశాఖ 2001 నుంచి జారీ చేస్తుంది. దీని గడువు 10ఏళ్ల వరకు ఉంటుంది. అంతకు ముందు జారీ చేసిన పాస్‌పోర్టులు చేతి రాతతో, ఫోటోలు అతికించి జారీ చేసేవారు. ఇవి 20 ఏళ్ల వరకు చెల్లుబాటు ఉంటాయి. గత ఏడాది నవంబర్ వరకు దేశంలో ఆరుకోట్ల పాస్‌పోర్టులు ఉండగా అందులో రెండుకోట్ల 86లక్షల నాన్ మిషన్ రీడబుల్ పాస్‌పోర్టులు ఉన్నాయని అధికారులు అంచనా వేశారు. నవంబర్ 24 నుంచి 2001 కంటే ముందు జారీ చేసిన పాస్‌పోర్టులు చెల్లవని అంతర్జాతీయ విమానయాన సంస్థ తేల్చి చెప్పింది. ఈ పాస్‌పోర్టు కలిగిన వ్యక్తులు విదేశాలకు వెళ్లే అవకాశం లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో 2001 కంటే ముందు పాస్‌పోర్టు పొందిన వారు మళ్లీ( రీ ఇష్యూ) జారీ చేయాలని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ సూచించింది. దీని కోసం వచ్చే నెల 24 లోపు 2001 కంటే ముందు పాస్‌పోర్టు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. చేతి రాత కలిగి ఉండి, 2001 కంటే ముందు జారీ చేసిన పాస్‌పోర్టు కలిగి విదేశాల్లో ఉన్నవారికి కూడా ఈ నిబంధన వర్తిస్తుందని అధికారులు చెప్పారు. వీరు కూడా రెన్యువల్ చేయించుకోవాలి ఆరు నెలల కంటే తక్కువ వ్యవది రెన్యూవల్‌కు ఉంటే వారు దరఖాస్తు చేసుకోవాలి. వీసా స్టాంపింగ్‌కు సంబంధించి రెండు పేజీలు మిగిలి ఉండగానే దరఖాస్తు చేసుకోవాలి.
తాజా వార్తలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్‌పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్‌లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..







