వర్క్‌ ఇంజ్యూరీస్‌: 370 మిలియన్‌ సౌదీ రియాల్స్‌

- May 19, 2017 , by Maagulf
వర్క్‌ ఇంజ్యూరీస్‌: 370 మిలియన్‌ సౌదీ రియాల్స్‌

సౌదీ అరేబియా హెల్త్‌ అండ్‌ సేఫ్టీ అసోసియేషన్‌ వెల్లడించిన వివరాల ప్రకారం పబ్లిక్‌ మరియు ప్రైవేట్‌ సెక్టార్స్‌కి సంబంధించి వర్క్‌ ఇంజ్యూరీస్‌ 67,000 పైచిలుకు నమోదయ్యాయి. వీటి కారణంగా 370 మిలియన్‌ సౌదీ రియాల్స్‌ ఖర్చయ్యిందని అంచనా వేశారు. గత ఏడాది జరిగిన వర్క్‌ ఇంజ్యూరీస్‌లో మొదటి స్థానం, కన్‌స్ట్రక్షన్‌ రంగంలో పై నుంచి కింద పడిపోవడం వల్ల సంభవించిన వాటికే దక్కింది. వీటితోపాటుగా తవ్వకాలు, ఫ్యాక్టరీలలో పని సందర్భంగా తగిలిన గాయాలు ముఖ్య భూమిక పోషించాయి. రెండో స్థానంలో క్షణాల్లో కూలిపోయిన ఘటనలు నిలిచాయి. అండర్‌గ్రౌండ్‌ సెప్టిక్‌ ట్యాంక్స్‌ ప్రమాదాలు మూడో స్థానంలో నిలిచాయి. జనరల్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ సోషల్‌ ఇన్స్యూరెన్స్‌ అందించిన లెక్కల ప్రకారం పై వివరాల్ని వెల్లడించారు. పని ప్రాంతాల్లో భద్రతా ప్రమాణాల్ని మరింత పెంచడం ద్వారా ఈ తరహా ప్రమాదాల్ని నివారించవచ్చునని సంస్థ ప్రతినిథి అబ్దుల్లా అల్‌ ఘామ్ది చెప్పారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com