ఉత్తరాఖండ్‌లో మళ్లీ విలయం, చిక్కుకుపోయిన 15000మంది భక్తులు
- May 19, 2017
విష్ణుప్రయాగ వద్ద విరిగిపడిన కొండచరియలు
- నిలిచిన చార్‌ధామ్ యాత్ర.. చిక్కుకుపోయిన 15000మంది భక్తులు
భక్తులు, యాత్రీకులను గగుర్పాటుకు గురిచేసేలా భారీ ఎత్తున కొండచరియలు విరిగిపడటంతో శుక్రవారం చార్‌ధామ్ యాత్ర నిలిచిపోయింది. ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్‌లో అంతర్భాగమైన విష్ణుప్రయాగ ప్రాంతంలో నేటి సాయంత్రం ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో బద్రీనాథ్‌కు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా మూసుకుపోయింది.
రహదారి మూసుకుపోవడంతో కనీసం 15 వేల మంది యాత్రీకులు ఎక్కడివారు అక్కడే ఆగిపోవాల్సివచ్చింది. వందలల సంఖ్యలో వాహనాలు బారులుతీరాయి. సమాచారం అందిన వెంటనే విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి, రహదారిని పునరుద్ధరించేపనిలో నిమగ్నం అయ్యారు.
కాగా, ఈ ఘటనలో ఎవరైనా చనిపోయారా? గాయపడ్డారా? అనే విషయాలు తెలియాల్సిఉంది. నాలుగేళ్ల కిందట చార్‌ధామ్ యాత్రలో పెనువిలయం సంభవించి వందలాదిమంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







