అదృశ్యమైన భారత సంతతి విద్యార్థి ఆలాప్‌ నర్సీపురా మృతి

- May 20, 2017 , by Maagulf
అదృశ్యమైన భారత సంతతి విద్యార్థి ఆలాప్‌ నర్సీపురా మృతి

అమెరికాలో అదృశ్యమైన భారత సంతతి విద్యార్థి ఆలాప్‌ నర్సీపురా మృతి చెంది కన్పించాడు. న్యూయార్క్‌లోని ఫాల్‌ క్రీక్‌ ప్రాంతంలో ఆలాప్‌ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
భారత సంతతికి చెందిన 20ఏళ్ల ఆలాప్‌ న్యూయార్క్‌లోని కార్నెల్‌ యూనివర్శిటీలో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ చదువుతున్నాడు. గత బుధవారం నుంచి ఆలాప్‌ కన్పించకుండా పోవడంతో పోలీసులు గాలింపు చేపట్టారు.ఇతాకా ఫాల్స్‌ సమీపంలోని ఫాల్‌క్రీక్‌ వద్ద ఓ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమందిచారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అది ఆలాప్‌ మృతదేహాంగా గుర్తించారు. ఆలాప్‌ మృతిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com