అజ్మన్‌ పోలీస్‌ కోసం 30 పెట్రోలింగ్‌ వాహనాలు

- May 20, 2017 , by Maagulf
అజ్మన్‌ పోలీస్‌ కోసం 30 పెట్రోలింగ్‌ వాహనాలు

ట్రాఫిక్‌ సమస్యల నుంచి వాహనదారులకు ఉపశమనం కల్పించేందుకోసం అజ్మన్‌ పోలీసులు 20 హైటెక్‌ మోటర్‌ సైకిల్స్‌ని సమకూర్చుకున్నారు. వీటిని రోడ్లపై మోహరిస్తారు. ఎమిరేట్‌ రోడ్లపై వీటిని మోహరించడం ద్వారా ట్రాఫిక్‌ని స్మూత్‌గా నడిచేలా చూడటంతోపాటుగా, భద్రతా పరంగానూ వాహనదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. అజ్మన్‌ పోలీస్‌ కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ మేజర్‌ జనరల్‌ షేక్‌ సుల్తాన్‌ బిన్‌ అల్‌ నౌమి మాట్లాడుతూ, చిన్న చిన్న ఘటనలు జరిగినప్పుడు వెంటనే అక్కడికి అధికారులు చేరుకోవడానికి ఈ పెట్రోలింగ్‌ మోటర్‌ సైకిల్స్‌ ఉపయోగపడ్తాయని చెప్పారు. యాక్సిడెంట్లు, నేరాలు జరిగినప్పుడు ట్రాఫిక్‌లో పోలీస్‌ వాహనాలు ఇరుక్కుపోవడం వల్ల సంఘటనా స్థలానికి వారు వెల్లడానికి ఆలస్యమవుతోంది. అలాంటి సమస్యకు ఈ మోటర్‌ సైకిల్‌ సెట్రోలింగ్‌ ఎంతగానో ఉపయోగపడ్తుంది. పెట్రోలింగ్‌ అధికారులు, పూర్తిస్థాయిలో శిక్షణ తీసుకుంటారనీ, ఫస్ట్‌ ఎయిడ్‌ మరియు రెస్క్యూ సర్వీసుల్లోనూ వారికి శిక్షణ ఇస్తామనీ, అలాగే మోటర్‌ సైకిల్స్‌ని స్టేట్‌ ఆఫ్‌ ఆర్ట్‌ లొకేషన్‌ ట్రాకింగ్‌, కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌, యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ వంటివి ఏర్పాటు చేశామని తెలిపారు. షేక్‌ సల్తాన్‌ బిన్‌ అబ్దుల్లా అల్‌ నౌమి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com