తిరిగి సినిమాల్లో మళ్లీ నటించనున్న విజయశాంతి

- May 20, 2017 , by Maagulf
తిరిగి సినిమాల్లో మళ్లీ నటించనున్న విజయశాంతి

80వ దశకంలో తెలుగుచిత్రసీమను ఏలిన హీరోయిన్లలో విజయశాంతిని ప్రముఖంగా చెప్పొచ్చు. సినిమా రంగంలో వెలుగువెలిగి 1998 నుంచి రాజకీయలమీద మక్కువ పెంచుకున్నారు విజయశాంతి. మొదట బిజెపిలో చేరి తర్వాత తల్లితెలంగాణ పేరుతో సొంతపార్టీపెట్టి తెలంగాణ వాణి వినిపించారు. తర్వాత ఆపార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేసి మెదక్ ఎంపీగా గెలిచి, టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు విజయశాంతి. గత ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటి నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు మళ్లీ వెనక్కి వచ్చి వెండితెరమీద మళ్లీ ఓ వెలుగువెలగాలని భావిస్తోంది రాములమ్మ. మెగాస్టార్ చిరంజీవిలా మేకోవర్ కావాలని తీవ్రమైన ఫిజికల్ ట్రైనింగ్ తీసుకుంటోంది. ప్రాముఖ్యత ఉన్న బాహుబలి శివగామి లాంటి సీరియస్ క్యారెక్టర్లు చేయాలని విజయశాంతి ఆలోచిస్తోందట. మొత్తానికి ఒకప్పటి గ్లామర్ క్వీన్ విజయశాంతిని తెలుగుప్రేక్షకులు మళ్లీ వెండితెరమీద చూడబోతున్నారన్నమాట.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com