ప్రధానితో భేటీ కానున్న సూపర్ స్టార్ రజనీ
- May 21, 2017
వేగంగా పావులు కదుపుతున్న సూపర్‌స్టార్
యుద్ధమంటూ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అభిమానులకు పిలుపు ఇచ్చిన సూపర్‌స్టార్ రజనీకాంత్ త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలవనున్నారు. ఈ వారంలోనే ఆయన దిల్లీ పర్యటన ఉంటుందని సమాచారం. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లూ చకచక సాగిపోతున్నాయి. అభిమానులతో ఇటీవల రజనీకాంత్ సమావేశమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా చివరిరోజు వ్యాఖ్యలపై రాష్ట్రంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తలైవర్ వేగంగా పావులు కదుపుతున్నారు. ఒకపక్క రాష్ట్రంలోని అన్నాడీఎంకే రెండు వర్గాలతో కూటమి ఏర్పాటుకు భాజపా మొగ్గుచూపుతోంది. అలాగే రజనీకాంత్‌ను మరోపక్క తమ పార్టీలోకి ఆహ్వానిస్తోంది. ఈ క్రమంలో రజనీ వ్యాఖ్యలు... ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారని అభిమానులు పేర్కొనడం ఆసక్తి రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రరాజకీయాల్లో చకచకా మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ వారంలో ప్రధానితో భేటీలో రజనీకాంత్ రాజకీయరంగ ప్రవేశం, రానున్న నెలల్లో రాజకీయ వేదికను ప్రారంభించడం, తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై చర్చించనున్నారు. దీందతో తలైవర్ దిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన ప్రధానితో భేటీ అయిన తర్వాత ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీనిపై రాష్ట్ర భాజపా నేతలు మాట్లాడుతూ...
అలాంటిదేమీ లేదని మాత్రం వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని అన్నాడీఎంకే రెండు వర్గాలు తమతో కలసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయని, భవిష్యత్తులో తాము తీసుకోబోయే నిర్ణయాలకు అనుగుణంగా వారు వ్యవహరిస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. పళనిస్వామి, పన్నీర్‌సెల్వం త్వరలోనే ఒకటవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









