మురగదాస్ పై అసహనంలో ఉన్నహీరో మహేష్ బాబు

- May 22, 2017 , by Maagulf
మురగదాస్ పై అసహనంలో ఉన్నహీరో మహేష్ బాబు

అనుకున్నది ఒక్కటి జరుగుతున్నది మరొక్కటి. బ్లాక్ బస్టర్ అని, మార్కెట్ రేంజ్ పెరుగుతుందని మహేశ్ బాబు ఎన్నో ఊహించుకున్నాడు. ఇండస్ట్రీ కూడా చాలా ఎక్కువే ఎక్స్ పెక్ట్ చేసింది. కానీ ఇప్పుడు జరగుతున్నదంతా మరోలా ఉంది. స్పైడర్ పై భారీ హోప్స్ పెట్టుకున్న మహేశ్ ను మురుగదాస్ చిరాకు పెడుతున్నాడట. ఓపికకు పరిక్షలు పెడుతున్నాడట. దీంతో ప్రిన్స్ చాలా అసహనంగా ఉన్నాడట. మరి మహీ ఇంత ఇదైపోయేలా మురుగ ఏంచేశాడు? వివరాల్లోకి వెళ్తే.. 
మురగదాస్ పై మహేశ్ బాబు చాలా అసహనంగా ఉన్నాడట. తాను ఎంతో ఊహించుకుంటే మురగ తన ఆశలను నొక్కి పెడుతున్నాడని, తన ఫ్యాన్స్ ను హర్ట్ చేస్తున్నాడని ఫీలవుతున్నాడట. తెలుగు,తమిళ్ బైలింగ్వల్ మూవీ, మురుగదాస్ డైరెక్టర్.. ఇక ఆ సినిమా ఓరేంజ్ లో ఉంటుంది, కెరీర్ కు చాలా ప్లస్ అవుతుంది, కోలీవుడ్ లోనూ మార్కెట్ క్రియేట్ అవుతుందని చాలా ఎక్స్ పెక్ట్ చేశాడట మహేశ్. కానీ ఇప్పుడు జరుగుతుందా మరోలా ఉంది. దీంతో మహేశ్ లోలోపల చాలా సఫర్ అవుతున్నాడట.
మురుగదాస్-మహేశ్ కాంబినేషన్ లో స్టార్ట్ అయిన స్పైడర్ సినిమా ఈ సమ్మర్ లోనే రిలీజ్ కావల్సి ఉంది. ఏప్రిల్ 28న స్పైడర్ విడుదల అని యూనిట్ నుంచి వార్తలు కూడా వచ్చాయి. కానీ ఈ టైం కు షూటింగ్ కూడా ఫినిష్ చెయ్యలేదు మురుగ. తనకు కావల్సినట్లుగా అవుట్ పుట్ వచ్చేంత వరకు రీషూట్స్ చేస్తూ షెడ్యూల్స్ ని సాగదీస్తున్నాడు. దీంతో స్పైడర్.. జూన్, జూలై అంటూ ఆగస్ట్ మీదుగా ప్రయాణించి ఫైనల్ గా సెప్టెంబర్ రిలీజ్ దగ్గర ఆగిపోయింది. ఇదే మహేశ్ ను కలవరపెడుతోందట.
మహేశ్ బాబు స్పైడర్ ను సమ్మర్ లో దింపి బిగ్గెస్ట్ హిట్ కొట్టాలని ప్లాన్ చేసుకున్నాడు. మేనెలలలో కొరటాల శివతో కలిసి భరతను నేను సినిమాను స్టార్ట్ చెయ్యాలనుకున్నాడు. కానీ ఇప్పటికీ స్పైడర్ క్లైమాక్స్ షూటింగ్ లోనే ఉంది. సో సినిమా భరత్ ఇంకా మొదలుకాలేదు. దీంతో ప్రిన్స్ చాలా బాదపడుతున్నాడట. కానీ మురుగదాస్ ను మాత్రం స్పీడప్ చెయ్యమని అడగలేకపోతున్నాడట. ఇండియన్ సినిమాలో ఓ స్పెషల్ ఇమేజ్ ఉన్న దర్శకుడిని ఎందుకు క్వశ్చన్ చెయ్యడం అని సైలెంట్ గానే షూటింగ్ కు వెళ్తున్నాడట. అయినా మార్కెట్ పెంచుకోవాలి, బంపర్ హిట్స్ రావాలి అనుకున్నప్పుడు ఇలాంటి వెయిటింగ్స్ ను భరించకతప్పదు కదా. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com