నా దృష్టంతా 'సాహో'పైనే.. హీరో ప్రభాస్
- May 23, 2017
‘బాహుబలి 2’ భారీ విజయంతో జాతీయస్థాయిలో ప్రభాస్ కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. దాంతో పలువురు బాలీవుడ్ దర్శక నిర్మాతల దృష్టి ఆయనపై పడింది. తమకి సినిమాలు చేసిపెట్టమంటూ భారీ పారితోషికాన్ని ఆఫర్ చేస్తున్నారు. అయినా ప్రభాస్ సున్నితంగా తిరస్కరిస్తూ వస్తున్నాడు. అందుకు కారణమేమిటని తాజాగా ఒక ఆంగ్ల దినపత్రిక అడిగిన ప్రశ్నకి ప్రభాస్ సమాధానమిచ్చాడు. తనకి డబ్బుకంటే .. ఫ్యామిలీ .. ఫ్రెండ్స్ ముఖ్యమని ప్రభాస్ చెప్పాడు. వాళ్లతో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతానని అన్నాడు. ప్రస్తుతం తన దృష్టి ‘సాహో’ సినిమాపై ఉందని చెప్పాడు. ‘బాహుబలి 3’ భాగం ఉంటుందో లేదో తనకి తెలియదనీ, ఒకవేళ అలాంటి అవకాశం వస్తే చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చాడు.
తాజా వార్తలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ







