ఇంగ్లండ్‌పై భీకర దాడులతో విరుచుకుపడతాం : ఐసిస్ ఉగ్రవాద సంస్థ
- May 23, 2017
ఇంగ్లండ్‌పై భీకరదాడులతో విరుచుకుపడతామని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఐసిస్ హెచ్చరించింది. అలాగే, ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌లో నరమేథం సృష్టించింది తామేనని ఆ సంస్థ ప్రకటించింది. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని... భీకరమైన దాడులు ముందున్నాయని హెచ్చరించింది. మాంచెస్టర్‌లోని మాంచెస్టర్ ఎరీనా వద్ద శక్తిమంతమైన బాంబు పేలడంతో 20 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మరో 50 మంది గాయపడ్డారు. దీనిపై ఇసిస్ ఓ ప్రకటన చేసింది. మోసుల్‌లో దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులు చేశామంటూ ట్విట్టర్‌లో కామెంట్ చేశారు. పైగా, ఈ దాడులు విజయవంతం కావడంతో ఇసిస్ తీవ్రవాదులతో పాటు సానుభూతిపరులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. కాగా, మాంచెస్టర్ దాడితో యూరోప్ దేశాలన్నీ అప్రమత్తమయ్యాయి. భద్రతను కట్టుదిట్టం చేశాయి. జనం ఎక్కువగా ఉండే చోట తనఖీలను ముమ్మరం చేశాయి. అమెరికా కూడా భద్రతను కట్టుదిట్టం చేసింది. మాంచెస్టర్ ఎరీనా మృతులకు బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
కాగా, ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్ ఎరీనాలో అరియాణా గ్రాండే సంగీత కచేరి జరుగుతున్న సమయంలో భారీ ఎత్తున గుమిగూడి ఉన్న సంగీత ప్రియులే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో దాదాపు 20 మంది మృతి చెందగా, పలువురికి తీవ్రగాయాలైనట్టు బ్రిటన్ మీడియా అధికారికంగా వెల్లడించింది.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







